The South9
The news is by your side.

9 ,10, 11, విద్యార్థుల కొరకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

post top

చెన్నై ప్రతినిధి :దేశంలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా పెరుగుతున్న వేళ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9,10,11,
పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయంతో 2020_2021 విద్యా సంవత్సరం విద్యార్థులు ఎటువంటి పరీక్ష రాయకుండా ఈ మూడు తరగతుల విద్యార్థులు ప్రమోట్ అవుతారని ముఖ్యమంత్రి తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, అనేకమంది అభ్యర్థన వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పళని స్వామి అన్నారు. గత సంవత్సరం covid 19 వల్ల విద్యార్థులు పలు సమస్యలు ఎదుర్కొన్నారని, మరలా అలాంటి సమస్యలు పునరావృతం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు తమ హర్షాన్ని వ్యక్తపరిచారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.