
గత కొంతకాలంగా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు దేవాలయాలు పై దాడులు మరియు ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెడుతున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని తెలుగుదేశం ఎంపీలు కలిసి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం నేత పట్టాభి పై నిన్న జరిగిన దాడి గురించి, అలానే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు అరెస్ట్ గురించి హోం మంత్రికి వివరించినట్టు తెలిసింది. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో లో జరుగుతున్నటువంటి దాడులు అధికార పక్షం వారి చేయిస్తున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా కి ఈ సందర్భంగా తెలియజేశారు .
Comments are closed.