విజయవాడ: మాజీ మంత్రి, టీడీపీ శాసనసభా పక్షం ఉపనాయకుడు కె.అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ ను ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.
ఈఎస్ఐ కుంభకోణం ఆయనను అరెస్టు విచారించి, విజయవాడ సబ్ జైలుకు తరలించిన విషయం తెలిసేందే. బెయిల్ పిటీషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు దాన్ని కొట్టివేసింది.
ఇదిలా ఉండగా అచ్చెన్న ను అసుపత్రికి తరలించే అంశపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. శనివారం తీర్పు ఇవ్వనున్నట్లు హైకోర్టు తెలిపింది. రెండోసారి శస్త్ర చికిత్స చేసినందున ఆరోగ్యం దెబ్బతిన్నదని అచ్చెన్న తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కాలకృత్యాలు కూడా తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలని న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
Comments are closed.