The South9
The news is by your side.
after image

ఇక సామాజిక అమరావతి.. మనందరిది: సీఎం జగన్

post top

 

*తేదీ : 24-07-2023*

: కృష్ణాయపాలెం, అమరావతి*

*ఇక సామాజిక అమరావతి.. మనందరిది: సీఎం జగన్*

 

*రూ.1,829.57 కోట్ల వ్యయంతో అమరావతిలో చేపట్టనున్న 50,793 ఇళ్ళు*

 

*చంద్రబాబు, గజదొంగల ముఠా, పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు: సీఎం జగన్*

 

Post Inner vinod found

సోమవారం కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి.. పట్టాలు అందించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అనంతరం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. “ఇవాళ పేదల విజయంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. పేదల వ్యతిరేకులంతా 18 కేసులు వేశారు. ఇందుకోసం ఎక్కడని గడపంటూ లేదు. మూడేళ్ల తరపున మీ కోసం పోరాటం చేశాం. అందుకే.. ఇది పెత్తందారుల మీద పేదల ప్రభుత్వం సాధించిన విజయం. రాక్షస బుద్ధితో ఉన్నవారితో మనం యుద్ధం చేస్తున్నాం.”

 

Post midle

సీఆర్‌డీఏ పరిధిలో పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం.. ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ. 1,829.57 కోట్ల వ్యయంతో అన్ని మౌలిక వసతులతో చేపట్టనున్న 50,793 ఇళ్ల నిర్మాణానికి, 45 సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్ వద్ద నేడే శంకుస్థాపన చేసిన సీఎం జగన్. వీటిలో ఒక్కో ప్లాట్‌ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైనవి.

 

లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో రూ.168 లక్షలతో 28,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఇలా ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతున్నారు.

 

ఈ పెత్తందారులు.. పేదవాడికి ఇంగ్లీష్‌ మీడియం అవసరమా? అని ప్రశ్నించిన వాళ్లు.. తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో చదివిస్తారు. సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేస్తారు. మరి చంద్రబాబు తన హయంలో పేదలకు ఉపయోగపడే పనులు ఎందుకు చేయలేదు అని సీఎం జగన్‌ నిలదీశారు. పేద పిల్లలు బాగుపడడం వాళ్లకు ఇష్టం లేదు. పెత్తందారుల బుద్ధి ఎలా ఉందో గమనించండి అంటూ ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తే రాజధాని అభివృద్ధి చెందదని కొందరు వాదించారు. పేరుకు ఇది రాజధాని.. అలాంటిది పేదలు ఇక్కడ ఉండకూడదా?. అందుకే.. ఇప్పుడు పేదలకు అండగా మార్పు మొదలైంది. అమరావతిని సామాజిక అమరావతిగా ఇవాళ పునాది రాయి వేస్తున్నా. ఇక నుంచి అమరావతి మన అందరిది.

 

అక్కచెల్లెమ్మల పేరిటే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.70 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 793 ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,370 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. నాలుగేళ్లుగా ఎంతో మంచి చేశాం. గత ప్రభుత్వం చేయని మంచి చేశాం. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి అని ఆయన ప్రజలను కోరారు.

Post midle

Comments are closed.