
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినీ పరిశ్రమ వ్యవహరించిన తీరు వేరుగా ఉండేది. ప్రాంతాలకి అతీతంగా ఏదైనా విపత్తు జరిగినప్పుడు సినీ పరిశ్రమ స్పందించేది. తమ వంతు గా తోచిన సహాయం చేసేవారు సినీ పెద్దలు. అదంతా ఇప్పుడు గతం. ఎప్పుడైతే తెలంగాణ, ఆంధ్ర వేరువేరుగా విడిపోయాయె. ఒక్కసారిగా సినీ పెద్దల వ్యవహారశైలి మార్పు చెందింది. తెలంగాణకి మాత్రమే చెందిన వారిలా వ్యవహరిస్తున్నారు. కెసిఆర్ జన్మదినం అయితే నేమి. అలాగే ఎంపీ సంతోష్ కోటి మొక్కల కార్యక్రమాలకి స్పందించడం, హాజరవడం చేస్తుంటారు . అదేమీ తప్పు కాదు ఎందుకంటే అక్కడే ఇండస్ట్రీ ఉన్నది కాబట్టి అక్కడ అధికారం ఉన్న పెద్దలతో సఖ్యత గా ఉండడం మంచిదే…….. నైజాం సీడెడ్ తోపాటు ఆంధ్ర మొత్తం వ్యాపారం కలిగిన సినీ పరిశ్రమ వారు ఇక్కడ ఏదైనా సమస్య వస్తే మనకెందుకులే అనుకోవడం ఎంతవరకు సబబు.. ప్రతి సమస్య స్పందించాల్సిన అవసరం ఉండదు ఎంతో కీలకమైన విశాఖ ఉక్కు పరిశ్రమ ను ప్రైవేటీకరణ చేస్తున్నారంటే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించక పోవడం శోచనీయం. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమకి విశాఖపట్నం తోటి విడదీయరాని అనుబంధం ఉంది. రెండో సినీ హబ్ గా పిలవబడే విశాఖ లో ఎన్నో వందల చిత్రాలు షూటింగ్ జరుపుకున్న నేపధ్యం ఉంది. అలాంటి విశాఖ నగరానికి చెందిన ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అవుతున్న సందర్భంగా సినీ పరిశ్రమ పెద్దలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ముఖ్యమంత్రి వైయస్ జగన్ సినీ పరిశ్రమను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. థియేటర్ల వ్యవహారాలు , అదనపు ఆటలు విషయాల్లో కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తే.. అప్పుడు సినీ పెద్దలు అంతా మరల కలిసి వస్తారేమో… అయితే కరొన విపత్కర సమయంలో సినీ పెద్దలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని కలిసి వాళ్ల సమస్యలతో పాటు, స్టూడియో కి భూములు కావాలని అడిగారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ పెద్దలు, అందరూ.. విశాఖ ఉక్కు పై కూడా స్పందించాలని కోరుకుంటున్నారు ప్రజలు……
Comments are closed.