టీడీపీను నోర్మూయించిన వైసీపీ ఇంటపోరుతో పరువు నడిబజార్న పెట్టుకుంది. ఇదంతా స్వయంకృతాపరాధమా.. దీనివెనుక ఏదైనా కుట్ర దాగుందా అనేది చర్చనీయాంశంగా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్వవహారం మాంచి రసకందాయంలో పడింది. కొద్దికాలంగా రఘురాముడు. వైసీపీ ను చీల్చిచెండాడుతున్నాడు. వైసీపీ లోగుట్టు బయటపెట్టి మరీ పరువు తీస్తున్నాడు. మీడియా ఎదుట.. పందులు.. కుక్కలంటూ తమ సొంతపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎండగడుతున్నాడు.
దాదాపు నెలరోజులుగా ఈ ఎంపీగారు చూపుతున్న చుక్కలకు అధినేత జగన్మోహనుడు కూడా నిస్సహాయంగా ఉండిపోయాడు. పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడుతున్నాడంటూ ఎంపీ రఘురామపై స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఎంపీ బాలశౌరి సారథ్యంలోని బృందం ఈ ఫిర్యాదు చేసింది. గతంలో జేడీయూ పార్టీ శరద్‌యాదవ్‌ను ఎంపీ పదవి నుంచి ఎలా తొలగించారో.. ఇప్పుడు అదే పంథాలో రఘురామ కృష్ణంరాజును కూడా తొలగించాలనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది.
స్పీకర్ కూడా తమకు సానుకూలంగా ఉన్నాడనే ఉద్దేశంతో వైసీపీ పావులు కదుపుతుంది. తాము అనుకున్నదంతా జరిగితే రెండుమూడ్రోజుల్లో ఎంపీ రఘురామకు ఉద్వాసన తప్పదనేంత ఆత్మవిశ్వాసం వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తుంది. ఇంతకీ.. రఘురాముడు ఇంతగా ఎందుకు బరితెగించాడు. అధికార పార్టీను కాలదన్ని ఏం చేయాలనుకుంటున్నాడనేది కూడా సస్పెన్స్. ఇదంతా బీజేపీ వెన్నుదన్నుగా ఉందనే ధైర్యమే కావచ్చనే ఊహాగానాలు లేకపోలేదు. ఎందుకంటే ఏడాది పాలనలో జగన్‌పై పాజటివ్ ఎక్కువగా ఉంది. ఇటువంటి సమయంలో పార్టీ వీడాలనే యోచన ఎందుకు తీసుకుంటానంటూ స్వయంగా ఎంపీగానే అమాయకంగా అడిగేశారు. కానీ.. నా గెలుపు నా సొత్తు. ఎమ్మెల్యేలు కూడా నా వల్లనే గెలిచారంటూ గేలిచేసినంత పనిచేశారు. ఇవన్నీ జగన్‌కు చిర్రెత్తించినా.. నోరు మెదపకుండా ఉన్నారు. ఫాఫం.. ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా బాగా కోపం వచ్చేలా చేసింది. ఇవన్నీ భరించలేకనే ఆయన్ను ఎంపీగా తొలగించాలనే నిర్ణయం తీసుకున్నామంటూ నెంబరు టూ చెప్పేశారు. రఘురాముడు పదవిని కాపాడుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాడు. వైసీపీ
ఏకంగా ఆయన్ను పార్టీ, పదవి నుంచి తొలగించమంటూ ఏకంగా లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మరి ఎవరు ఎవరిపై పై చేయి సాధిస్తారో.. రాజీకుదుర్చుకుని సైలెంట్ అవుతారో వేచిచూడాల్సిందే.
Comments are closed.