విజయవాడ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గోస్వామిచే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీజేగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
సీజే అరూప్ కుమార్ గోస్వామితో కలిసి సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం వైఎస్ జగన్ పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సహా పలువురు న్యాయమూర్తులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments are closed.