
చెన్నై ప్రతినిధి:. చెన్నై కేంద్రంగా దేశంలోనే వివిధ వివిధ ప్రాంతాల్లో బ్రాంచీలు కలిగిన ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థలైన లలిత జ్యువెలరీ, శివ సహాయ అండ్ సన్స్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు ఇరవై ఏడు చోట్ల మూడు రోజులు పాటు ఏకకాలంలో జరిపిన ఈ దాడుల్లో వెయ్యి కోట్లు కు పైగా పన్ను ఎగవేతకు సంబంధించిన పత్రాలు ,రసీదులు బయటపడ్డాయి. చెన్నై కేంద్రంగా ముంబై, మధురై త్రిసూర్, జైపూర్, ఇండోర్, ఆంధ్రా లోని నెల్లూరు లో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లో 1.2 కోట్ల రూపాయల ధనాన్ని స్వాధీనపరుచుకున్న రని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ధ్రువీకరించారు.
Comments are closed.