
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఒక పబ్ లో ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఉదయం నుంచి ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో, ప్రతిపక్ష పార్టీ బిజెపి నాయకులు దాని మీద విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. తనకు సన్నిహితులు అయినా జర్నలిస్ట్ ఫ్రెండ్ మ్నీమా ఉదాస్ వివాహ వేడుకకు సోమవారం నేపాల్ లోని ఖాట్మండు కి వెళ్లారు. ఖాట్మాండులోని మారియట్ హోటల్ లో బస చేసిన రాహుల్ పెళ్లికి సంబంధించిన వేడుకల్లో భాగంగా నైట్ పార్టీ నీ ఒక క్లబ్బులో నిర్వహించగా రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సంబంధించిన వీడియో ని ఒక వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీతోపాటు చైనా మహిళ దౌత్యవేత్త కూడా ఉండడంతో , ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. ఇది రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన అని దీనిపై కూడా రాజకీయ దుమారం రేపడం మంచి పద్ధతి కాదని , ముందు దేశంలో పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలు ని నియంత్రించాలని బిజెపి నాయకులకు చురకలంటించారు.

Noiiice ? pic.twitter.com/jTvUyVuE7A
— Ajit Datta (@ajitdatta) May 3, 2022

Comments are closed.