పశ్చిమగోదావరి: జిల్లాపంచాయతీ అధికారి (డీపీఓ) పై వచ్చిన లైంగిక వేదింపుల ఆరోపణలను విచారించిన జిల్లాకలెక్టర్ ముత్యాలరాజు డీపీఓ శ్రీనివాస్ విశ్వనాథ్‌ను పంచాయతీరాజ్ కమిషనరేట్ కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
డీపీఓ పై వచ్చిన లైంగిక వేధింపుల కేసులో జిల్లా ఎస్పీ నివేదిక ఆధారంగా డీపీఓను పంచాయతీ రాజ్ కమిషనరేట్ కు సరెండర్ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా డీపీవో స్థానంలో జడ్పీ సీఈవో పులి శ్రీనివాసులు అదనపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.
Comments are closed.