ఢిల్లీ: విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి డా.రమేష్ పోక్రియాల్ నిశాంక్ తెలిపారు.
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఒకసారి వాయిదా వేసిన ప్రభుత్వం తాజాగా మరోసారి వాయిదా వేసింది.జేఈఈ మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ మధ్య, జేఈఈ అడ్వాన్స్ డు సెప్టెంబర్ 27న, నీట్ ఎగ్జామ్ సెప్టెంబర్ 13న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా ప్రవేశ పరీక్షల నిర్వహణపై పలు వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.
Comments are closed.