హిందూ మహా సముద్రంలోకి కూలిన రాకెట్
గత కొన్ని రోజులుగా యావత్తు ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5బి’ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలాయి. దీంతో భూమిపై పడనున్నాయన్న భయాందోళనలకు తెరపడింది. భూ వాతావరణంలోకి రాగానే చాలా వరకు శకలాలు పూర్తిగా భస్మమయ్యాయి. కేవలం కొన్ని చిన్న చిన్న భాగాలు మాత్రమే సముద్రంలో పడ్డాయి. ఈరోజు ఉదయం భూవాతావరణంలోకి ప్రవేశించిన శకలాల దశను చైనా మ్యాన్‌డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ ఎప్పటికప్పుడు పరిశీలించింది. హిందూ మహా సముద్రంపై రాకెట్ భాగాలు విచ్ఛిన్నమయ్యాయని ముందే పేర్కొంది. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం కలిసే ప్రాంతంలో శకలాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో భాగంగా చైనా గతవారం ‘లాంగ్‌మార్చ్ 5బి’ అనే భారీ రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్ర కోర్ మాడ్యూల్‌ను అది విజయవంతంగా మోసుకెళ్లింది. అయితే ఆ రాకెట్ నియంత్రణ కోల్పోయిందని, దాని శకలాలు సముద్ర జలాల్లో కాకుండా సాధారణ భూభాగంపై పడిపోయే ముప్పుందని అంతరిక్ష రంగ నిపుణులు తొలుత ఆందోళన వ్యక్తం చేశారు. దాని ప్రయాణ మార్గాన్ని తమ అంతరిక్ష సంస్థలు ఎప్పటికప్పుడు పరిశీలించాయి.
Comments are closed.