
విజయవాడ: ఏపీ మాజీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ ఇంట్లో మరియు బంధువులు ఇండ్లల్లో సిఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో నిన్న చంద్రబాబు నాయుడుతో పాటు నారాయణ కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు
నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ లలో నారాయణ సంస్థలకు చెందిన కార్యాలయాలోసోదాలు
ఏక కాలంలో కొనసాగుతున్నాయి.

విజయవాడ, హైదరాబాద్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నారాయణకు చెందినవి ఇంకా ఏమేమి ఉన్నాయో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది . ఏక కాలంలో అన్ని చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఇన్ని చోట్ల ఒకేసారి సోదాలు జరగుతుండటం సంచలనంగా మారింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారాయణకు సీఐడీ అధికారులు నిన్న నోటీసులు అందజేశాన తర్వాత వెంటనే ముమ్మర దాడుల నేపథ్యంలో తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నెల 23న విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు జరుపుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నారాయణ ఎక్కడ నిరసన కార్యక్రమాల్లో కాని పార్టీ కార్యక్రమాల్లో కాని పాల్గొన్న దాఖలాలు లేవు . ఈ నేపథ్యంలో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తిగా మారింది.
Comments are closed.