
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుంది అనుకుంటున్న సమయంలో కొంతమంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన చాలా మంది ప్రముఖులు కు ఈ మధ్యకాలంలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ కూడా గత కొంతకాలం క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్న విషయం ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ్ సూపర్ స్టార్ సూర్యా కి కరోనా పాజిటివ్ వచ్చిందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తనకు బాగానే ఉంది అని, కరోనా కి భయపడకుండా జాగ్రత్తలు పాటించాలని అంటూ…. చిత్తశుద్ధి గా తనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకి ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేశారు సినీ హీరో సూర్య. చాలా రోజుల తర్వాత ఆకాశమే నీ హద్దురా చిత్రం ద్వారా విజయాన్ని అందుకున్నాడు సూర్య. ఆయన త్వరగా కోలుకోవాలని ఈ సందర్భం కోరుకుంటున్నాము. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రజలు ఇంకా జాగ్రత్తలు తీసుకుంటూ, మాస్క్ ,భౌతిక దూరం తప్పకుండా పాటిస్తూ కరోనా ని పూర్తిస్థాయిలో కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిది.
Comments are closed.