
చెన్నై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని తూత్తుకుడిలో పోలీసు కస్టడీలో తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో ఆరుగురు పోలీసులపై మర్డర్ (హత్య) కేసు నమోదైంది. వివరాల్లోకెళితే..తండ్రీ కొడుకులైన జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టడంతో మృతిచెందారు.

ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై స్పందించిన సీఎం పళనిస్వామి ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సీబీ-సీఐడీ ఈ కేసులో ప్రధాన నిందుతులైన ఇన్ స్పెక్టర్ శ్రీధర్, ఎస్సైలు బాలకృష్ణన్, రఘుగణేష్, హోంగార్డులు ముతురాజ్, మురుగన్ సహా ఆరుగురిపై సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Comments are closed.