The South9
The news is by your side.
after image

సస్పెన్స్,థ్రిల్లర్, రొమాన్స్ ఏంటర్ టైనర్ ‘డిటెక్టీవ్ సత్యభామ’ మూవీ రివ్యూ

post top

సస్పెన్స్,థ్రిల్లర్, రొమాన్స్ ఏంటర్ టైనర్ ‘డిటెక్టీవ్ సత్యభామ’ మూవీ రివ్యూ

నటీ నటులు  :  సోని అగర్వాల్‌, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్‌, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్‌, భరత్‌,కార్తిక్ తేజ రెడ్డి, తదితరులు.
రివ్యూ రేటింగ్ : 3.25/5
సినిమా : ‘డిటెక్టివ్‌ సత్యభామ
బ్యానర్‌ : సిన్మా ఎంటర్టైన్మెంట్‌
నిర్మాత : శ్రీశైలం పోలె మోని
సంగీతం`దర్శకత్వం: నవనీత్‌ చారి
కెమెరా&ఎడిటర్‌: లక్కీ ఏకరి
డైలాగ్‌ : సంతోష్ ఇంగాని
పి.ఆర్‌.ఓ : ఆర్‌.కె. చౌదరి

సిన్మా ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై  శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల డిసెంబర్ 31న ఎంతో గ్రాండ్ గా థియేటర్స్‌ లలో రిలీజ్ అయిన ఈ చిత్రం  ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూలో చూద్దాం పదండి

Post Inner vinod found

కథ
సునీత పాండే,అర్జున్ లు ప్రేమించి పెళ్లిచేసుకొని ఎంతో అన్యోన్యంగా వుంటారు.అయితే ఒకరోజు అర్జున్ వేరే అమ్మాయితో చనువుగా ఉండడం చూసి తట్టుకోలేక తన భర్త ను నిలదీస్తుంది.ఆ అమ్మాయి హెల్ప్ కోరిందని అర్జున్ చెప్పడంతో కూల్ అవుతుంది. ఇలా తన భర్తను ఆ అమ్మాయితో చూసిన ప్రతి సారి తనకు అబద్ధం చెబుతున్నాడని తెలుసుకొని తట్టుకోలేక క్షణికావేశంలో భర్తను చంపేస్తుంది. ఇలా తన భర్త కోసం వచ్చిన అమ్మాయిని కూడా చంపేస్తూ సైకో గా మారి సమాజంలో అందరి భర్తలు ఇలాగే ఉంటారని తనే ఒక లూనీ గ్రూప్ ను ఏర్పాటు చేసి లూనీ పేరుతో ఎంతో మందిని సైకోలు గా మారుస్తుంది. అయితే కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు కొత్త ఇంట్లో దిగిన తర్వాత వారి మధ్య ఎప్పుడైతే గొడవలు మనస్పర్ధలను వస్తాయో వాటిని అడ్వాంటేజ్ తీసుకొని లూనీ గ్యాంగ్ ద్వారా వారి మూమెంట్స్ ను  క్యాప్చర్ చేసి సమాజంలో ఉండే ప్రతి భర్త ఇలాగే బిహేవ్ చేస్తాడని క్రియేట్ చేసి వారి భార్యల ద్వారానే వారి భర్తలను చంపేయించి తరువాత వారిని లూనీ లుగా మారుస్తూ లూనీ నెట్ వర్క్ ను పెంచుకుంటుంది సునీతా పాండే. అయితే పోలీస్ స్టేషన్ కు ఎన్నో మిస్సింగ్ అవుతున్న కేసులు రావడం ఎక్కువ అవుతుంటాయి. అయితే వీటిని అక్కడున్న పోలీస్ ఆఫీసర్ పక్కన పెట్టేయడంతో అవన్నీ  పెండింగ్ ఫైల్స్ గా మిగిలిపోతాయి.ఇలా వస్తున్న  ఈ కేసులను చూసిన ప్రైవేట్ డిటెక్టివ్ సత్యబామ (సోనీ అగర్వాల్) దృష్టికి రావడంతో స్టేషన్ లో ఉన్న పెండింగ్ ఫైల్స్ అన్నిటినీ ఇన్వెస్టిగేషన్ చెయ్యడానికి ముందుకు వస్తుంది.ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో సైకోలనుండి డిటెక్టీవ్ సత్యభామ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది. అసలు లూనీ అంటే ఎవరు ? లూనీలు గా మారిన వీరు ఎందుకు సైకోలు మారుతున్నారు, ఈ లూనీ గ్రూప్ కు అసలు సూత్రదారులెవ్వరు? ఈ సైకోలను చంపి సమాజంలో మరో మిస్సింగ్ జరగకుండా అపగలిగిందా..ఇవన్నీ తెలుసు కోవాలంటే సినిమా చూడాల్సిందే ?

నటీనటుల పనితీరు
డిటెక్టివ్ సత్యబామ(సోనీ అగర్వాల్) పాత్ర ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది.లూనీలకు అడ్మిన్ గా సునీత పాండే చక్కటి విలనిజం చూపించింది.ఒక భార్యగా,విలన్ గా చాలా బాగా నటించింది, రోబో గణేష్ చేసిన సైకో యాక్టింగ్ బాగుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవి వర్మ మంచివాడనే ముసుగులో క్రూరుడుగా చాలా బాగా నటించాడు.కామెడీ టైమింగ్ లో కనిపెట్టు పాత్రలో (బస్ స్టాప్ కుమార్ సాయి) అందరినీ నవ్వించేలా చాలా మంచి పెర్ఫార్మన్స్ చేశాడు,సోనాక్షివర్మ (షీలా) సంజన, పూజ లు తమ రొమాన్స్ తో  కుర్రకారును ఆకట్టుకున్నారు. చాలా మంది కొత్తవారు ఉన్న వారికిచ్చిన పాత్రలలో చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
సంగీత దర్శకుడుగా ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన నవనీత్ చారి చిత్ర దర్శకుడు గా మారి చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో అన్నివర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చేస్తూ ఇలాంటి లూని లు సమాజంలో మన మద్యే ఉంటారానే విషయం గమనించాలి అనే ఫీలింగ్ కలిగిస్తూ అందరికీ నచ్చేవిధంగా చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు నవనీత్ చారి.కొత్తగా పెళ్లయిన తర్వాత ఎంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఎందుకు గొడవ పడతారు అనే విషయాన్ని చాలా చక్కగా చూపించాడు. కొత్తగా పెళ్లి అయిన వారందరూ ఈ సినిమాను తప్పక చూడాలి. ఎందుకంటే వారి మధ్యన వచ్చిన చిన్న మనస్పర్థలను, చిన్నచిన్న గొడవలు ఎలా తయారు అవుతాయి.ఫైనాన్స్ పరంగా, పర్సనల్ గా ఎమోషనల్ గా ఎవరో చెప్పిన మాటలకు నమ్మి  తప్పుడు పద్ధతుల వెళ్లకుండా వీటన్నిటినీ ఓవర్ కం  చేసుకోకపోతే  మన కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకొనే వారవుతాము అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. నవనీత్ చారి దర్శకుడిగా, సంగీత దర్శకుడుగా తన మ్యూజిక్ తో ప్రాణం పోసాడు అని చెప్పాలి. ఇందులో ఉన్న నాలుగు పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఆడియన్స్ కు కోరుకునే  లిప్ లాక్స్ ,లవ్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి.ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఫోటోగ్రఫీ లక్కీ కెమెరా వర్క్ బాగుంది.ఆఫ్ లైటింగ్ ఫోటోగ్రఫీ అనేది కొత్తగా ఉంది. విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి.ఎడిటింగ్  క్లాసీగా చాలా బావుంది.ఇకపోతే చివరిగా ప్రొడ్యూసర్ శ్రీశైలం పోలె మోని గురించి చెప్పాలంటే.. మనం అనుకున్నదది తెర మీద కార్యరూపం దాల్చాలి అంటె ప్రొడ్యూసర్ ఉండాలి అలాంటిది ఇది తనకు మొదటి చిత్రమైనా చక్కటి కథను ఎంచుకుని ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా చాలా చక్కగా చిత్రాన్ని తెరకెక్కించాడు. చివరికి ఈ లూనీ గ్యాంగ్ అసలు సూత్ర దారుడెవ్వరో తెలుసుకున్న డిటెక్టీవ్ సత్య భామ తనని చంపడానికి బయలుదేరడంతో సినిమా ముగుస్తుంది.అంటే ఇంకా ఈ సినిమా సెకండ్ పార్ట్ లో ఉంటుందని దర్శకుడు చాలా చక్కగా కన్విన్సింగ్ గా చెప్పాడు.థ్రిల్లర్ రొమాన్స్ సినిమాల్ని ఆదరించే ప్రేక్షకులకు “డిటెక్టీవ్ సత్యభామ” సినిమా కచ్చితంగా నచ్చుతుంది. రేటింగ్ : 3.25 / 5

 

Post midle

Comments are closed.