నెల్లూరు ప్రతినిధి : గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం నందుగల కరోనా వైద్యానికి ఇస్తున్న ఆయుర్వేద ముందు అందుబాటులోకి రానుంది. కొన్ని రోజులుగా ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య నేతృత్వంలో ఉచితంగా కరోనా మందు ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ మందు పై విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో 2 రోజుల క్రితం జిల్లాలోని ఉన్నతాధికారులు వెళ్లి పరిశీలించి ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. ఈ ఆయుర్వేద మందు సత్ఫలితాలు ఇవ్వడం తోటి ఎక్కడ కూడా మందు వికటించిన పరిస్థితులు లేనందువలన ప్రజలకు ఎక్కువ నమ్మకం కలగడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజల మద్దతు ఉన్నందువలన మందు పంపిణీ రేపటి నుంచి యధావిధిగా జరగనుందని తెలుస్తోంది. అలాగే ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి స్వయంగా పాల్గొని పర్యవేక్షిస్తారని సమాచారం.
Comments are closed.