న్యూయార్క్: కరోనా వైరస్ అమెరికాలో అంతకంతకూ విస్తరిస్తుండడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోపం అంతకంతకూ పెరుగుతోంది.
చైనా దేశం పేరు చెబితే చాలు కస్సబుస్సు మంటున్నాడు. ఇటీవలే కరోనా వైరస్ కు కుంగ్ ఫ్లూ వైరస్ అని పేరు పెట్టారు. కరోనా నియంత్రణ ఇప్పట్లో సాధ్యం కాదని డాక్టర్లు చెప్పడంతో ట్రంప్ ఊగిపోయి, పళ్ళు పటపటమని కొరికారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన చైనాపై విరుచుకుపడ్డారు.
చైనా, తమ దేశంలో కరోనా వైరస్ ను ఊహాన్ దాటకుండా కట్టడి చేసి, దాన్ని దేశ సరిహద్దులు దాటించి ప్రపంచానికి వ్యాపింపచేసిందని మొదటి నుంచి విమర్శిస్తున్నారు. ఈ విషయంలో చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లు దాగుడు మూతలు ఆడాయని ఆయన ఆరోపించారు. చైనా కారణంగానే ప్రపంచ దేశాల్లో వైరస్ విజృంభణ కొనసాగుతోందని ట్రంప్ అంటున్నారు.
Comments are closed.