
సంవత్సరాల ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘మక్కల్ సేవై కట్చి’ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. అంతేకాదు రజనీ పార్టీకి ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించిందనే వార్తలు కూడా ప్రచారమయ్యాయి. దీంతో రజనీ అభిమానులు పండగ చేసుకున్నారు.

అయితే, వారిని నిరాశకు గురి చేసేలా రజనీ ప్రధాన అనుచరుడు, రజనీ మక్కల్ మండ్రం నేత వీఎన్ సుధాకర్ ఒక ప్రకటన చేశారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరారు. రజనీ మక్కల్ మండ్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు అభిమానులు ఓర్పు వహించాలని ఓ ప్రకటనలో విన్నవించారు.
Comments are closed.