అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఇతర రాష్ట్రాల వారు ఈ-పాస్ తప్పనిసరిగా తీసుకోవాలని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పాస్ లు ఉన్నవారిని ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పొందుగల వద్ద గల రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ద్వారా తెలంగాణా మరియు ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికి రావడానికి తప్పని సరిగా ఈ-పాస్ తీసుకోవాలని తెలిపారు. e-Pass కలిగి ఉన్న వారిని ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు క్వారంటైన్ సెంటర్ లో ధర్మల్ స్క్రీనింగ్ మరియు మెడికల్ టెస్ట్ లు చేసిన తరువాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ లోనికి అనుమతిస్తామని తెలిపారు. దీనికి ప్రజలు సహకరించాలని కోరారు.
Comments are closed.