ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా ఏడాది కాలం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నది ఏంటనేది అందరికీ తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా దూకుడుగా అడుగులు వేసింది. ఆయనను పక్కకు తప్పించి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తిని ఒకరిని తీసుకు వచ్చి రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా నియమించాలని భావించి ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఆయన నియామకం చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత మళ్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చింది. జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అయితే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 31 తర్వాత ఎన్నికల కమిషనర్ గా రిటైర్ అవుతున్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఈ తరుణంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎటువంటి అడుగులు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. తన పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రాజీనామా చేస్తే ఎవరిని నియమించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో మూడు పేర్లు పరిశీలనకు వచ్చాయి. కొత్త ఎస్ఈసీ నియామకంపై ఏపీ సర్కార్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. మాజీ సీఎస్ నీలం సాహ్నీ, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్ల పరిశీలనలో ఉన్నాయి. వీరి ముగ్గురి పేర్లను గవర్నర్ కు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాలు గవర్నర్ తో మాట్లాడి మాజీ సీఎస్ నీలం సాహ్నిని కొత్త ఎన్నికల కమీషనర్ గా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. నిర్ణయాధికారం గవర్నర్ దే అయినా, ఆయన ప్రభుత్వ అభిప్రాయం తీసుకుంటారన్న విషయం తెలిసిందే.
Comments are closed.