The South9
The news is by your side.
after image

‘వైఎస్ఆర్’ కుటుంబంపై దాదాకు అవధుల్లేని ప్రేమాదరములు: మాజీ ఎంపీ, Ysrcp సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి

  • ప్రణబ్ ముఖర్జీని కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా
  • ప్రజ్ఞాపాటవాలకు నిలువెత్తు రూపం ప్రణబ్ ముఖర్జీ
  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలందరి మనిషి
  • పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిపై సమదృష్టి ప్రణబ్ కే సాధ్యం
  • ప్రణబ్ ముఖర్జీతో జ్ఞాపకాలను వీడియో ద్వారా మీడియాతో పంచుకున్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్, 01; ప్రజ్ఞాపాటవాలకు నిలువెత్తురూపమైన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్త దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసిందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. మేధావి, రాజనీతిజ్ఞులు, నిజాయతీపరుడైన మహోన్నత వ్యక్తిని కోల్పోవడం జీర్ణించుకోలేని వార్తని మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో దాదాతో ఉన్న అనుబంధాన్ని ఆయన మీడియాతో ప్రత్యేకంగా పంచుకున్నారు. ప్రధాన మంత్రి పదవి మినహా దేశంలోని అన్ని ఉన్నత పదవులలోనూ అభివృద్ధికై నీతి, నిజాయతీగా కృషి చేసిన అపర చాణక్యుడు ప్రణబ్ ముఖర్జీ అని మేకపాటి పేర్కొన్నారు.

Post Inner vinod found

వైఎస్ఆర్’ కుటుంబంపై ప్రణబ్ వాత్సల్యం మాటలకందని మధురానుభూతి

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి కుటుంబపై ప్రత్యేక ప్రేమాదరములు చూపిన తీరు చిరకాలం గుర్తుండే మంచి జ్ఞాపకాలని రాజమోహన్ రెడ్డి అన్నారు. విశేషించి వాత్సల్యాస్పద అయిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మగారితో పాటు రాష్ట్రపతి అయిన తరువాత ప్రణబ్ ను కలిసినప్పుడు ఎంతో ఆప్యాయతతో స్పందించిన విధానాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాతో సమావేశమైనపుడూ జగన్ ను వాత్సల్యంగా పలకరించిన విధానాన్ని రాజమోహన్ రెడ్డి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. దేశానికి 13 రాష్ట్రపతిగా పోటీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అందరూ ఏకాభిప్రాయంతో మద్దతు ఇవ్వడాన్ని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 5 దశాబ్దాల రాజకీయ,ప్రజా జీవితంలో చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రణబ్ ముఖర్జీ కృషి, సేవలని కొనియాడారు. గతంలో నాగపూర్ ఆర్ఎస్ఎస్ సమావేశానికి ఆహ్వానం అందడంతో అక్కడకు వెళ్లి ప్రణబ్ ప్రసంగించిన తీరు ఆయనలోని కూడా లౌకికవాదానికి నిదర్శనమన్నారు. లైబ్రరీ కమిటీ సభ్యుడిగా ప్రణభ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ, లైబ్రరీ కమిటీ ఛైర్మన్ గా తాను ఉన్నపుడు వ్యక్తిగతంగా ఆయనతోగల సాన్నిహిత్యాన్ని మేకపాటి రాజమోహన్ రెడ్డి జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

Post midle

Comments are closed.