జయశంకర్ భూపాలపల్లి: తొలి ఏకాదశి వేడుకల్లో విషాదం చేసుకుంది. గోదావరిలో పుణ్య స్నానాలకు వెళ్లిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు యువకులు మృతి చెందారు.
పలిమెల మండలం లెంకలగడ్డ సమీపంలో గోదావరిలో నదిలో ఏకాదశి స్నానానికి వెళ్లి కార్తీక్, రవీందర్, ప్రదీప్ అనే ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు.
మహదేవపూర్ మాండల కేంద్రంలోని పోతవాడకు చెందిన తుంగల శ్రీశైలం(20) గోదావరి స్నానానికి వెళ్లి మృతి చెందారు.
దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోధనలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. చేతికి వచ్చిన కుమారులు చనిపోయారంటూ తల్లిదండ్రులు రోధించారు.
Comments are closed.