The South9
The news is by your side.

దర్శకసంచలనం హరీష్ శంకర్ విడుదల చేసిన క్షీర సాగర మథనం గీతం!!

post top

అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం ‘క్షీర సాగర మథనం’. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. ‘క్షీరసాగరమథనం’లోని ‘నీ పేరు పిలవడం… నీ పేరు పలకడం’ గీతాన్ని సంచలన దర్శకులు హరీష్ శంకర్ ట్విట్టర్ లో విడుదల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. అజయ్ అరసాడ స్వర కల్పనలో.. శ్రీమణి రాసిన ఈ పాటను ‘రాములో రాముల’ ఫేమ్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

after image

చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. ‘క్షీర సాగర మథనం’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కొత్త తరహా చిత్రాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే తెలుగు ప్రేక్షకులు.. “క్షీర సాగర మథనం” చిత్రాన్ని తప్పక ఆదరిస్తారనే నమ్మకముంది.

మా చిత్రం టీజర్ సంచలన దర్శకులు క్రిష్ చేతుల మీదుగా విడుదల కాగా…
పాట ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ చేతుల మీదుగా రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.
చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.