The South9
The news is by your side.

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్‌లైన్‌ విద్యకు భారీ స్పందన

post top

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్‌లైన్‌ విద్యకు భారీ స్పందన లభించింది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఆన్‌లైన్‌ విద్యను టీ-సాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్ల ద్వారా ప్రారంభించిన విద్యాశాఖ మంచి ఫలితాలను రాబట్టింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్దులు ఆన్‌లైన్‌ పాఠాలు చూసినట్టు టీ-సాట్‌ యాప్‌ద్వారా నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ, సమయం ప్రకారం మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్‌లైన్‌ విద్యాబోధన నిర్వహిస్తున్నారు. ప్రారంభమైన మొదటి రోజే 11,73,921 వ్యూస్‌ రాగా, 1,56,658 సబ్‌ స్ర్కైబ్‌లు లభించాయి.

after image

ఒక్కరోజే భారీగా విద్యార్ధుల నుంచి స్పందన లభించడం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖలోనూ ఉత్సాహం నింపింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యాశాఖ చేస్తున్న శ్రమకు మంచి ఆదరణ లభించడంతో ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారాక రామారావు సంతోషం వ్యక్తం చేశారు. విద్యాశాఖను, ప్రసారాలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన టీ-సాట్‌ను అభినందించారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.