The South9
The news is by your side.
after image

ప్రజాప్రతినిధి అయితే ప్రతి ఒక్కరికి సేవ చేయాల్సిందే : మాజీ ఎమ్మెల్యే మేకపాటి

post top

*కలసికట్టుగా కష్టపడుదాం… మళ్లీ ప్రభుత్వాన్ని సాధించుకుందాం : మాజీ మంత్రి కాకాణి*

*: ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశం*

*: ప్రజాప్రతినిధి అయితే ప్రతి ఒక్కరికి సేవ చేయాల్సిందే : మాజీ ఎమ్మెల్యే మేకపాటి*

 

రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కొల్పోయిందని, అందరూ కలిసికట్టుగా కష్టపడడం ద్వారా మళ్లీ ప్రభుత్వాన్ని సాధించుకోవచ్చునని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.

 

వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీధర్ గార్డెన్స్ లో నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్ బల్లి కళ్యాణ చక్రవర్తి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పలు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ ఇన్ చార్జులు ఎండీ ఖలీల్, మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందచేసి ఎక్కడో చిన్న లోపాల వల్ల ప్రభుత్వాన్ని కోల్పోయామని, దీంతో నాయకులు, కార్యకర్తలు కొంచెం డీలా పడ్డారని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు.

 

Post midle

ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలోని అందరం వైఎస్సార్సీపీ నాయకులందరం సమిష్టిగా కార్యాచరణ సిద్దం చేసుకుని ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నామని పేర్కొన్నారు. సమిష్టి కార్యాచరణ ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకోవచ్చునని అందరి తెలిపి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మీ ముందుకు వచ్చి ధైర్యం చెబుతున్నామని పేర్కొన్నారు.

 

Post Inner vinod found

ఎవరికైనా గొడవలు జరిగినా, విధ్వంశాలు జరిగినా, శిలఫలాకలు ధ్వంసం చేసిన గుర్తు పెట్టుకుని వాళ్ల చేత మళ్లీ కట్టించే విధంగా చర్యలు చేపడుతామని, జిల్లా వైఎస్సార్సీపీ కలిసికట్టుగా ఉండి ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా తమ కుటుంబంలో రాజకీయాల్లో ఉందని, గెలుపొటములు సాధారణమేనన్నారు. తమ తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నాలుగు సార్లు ఎంపీగా విజయం సాధించినా రెండుసార్లు ఓటమి చెందారని, తమ బాబాయ్ చంద్రశేఖర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని, మూడుసార్లు ఓటమి చెందారని అన్నారు.

 

తమ కుటుంబం నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో న్యాయం కోసమే మాత్రమే పనిచేసిందని పేర్కొన్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల అభివృద్ది కోసం పనిచేశారని, ఈ ఓటమితో మరింతగా నేర్చుకునేందుకు అవకాశం దక్కిందని అన్నారు.

 

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైఎస్సార్సీపీ నాయకులపై రకరకాలుగా కేసులు పెడుతూ వారి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది ఏ మాత్రం సహించే విషయం కాదన్నారు. దీనిపై జిల్లా నాయకత్వం సమిష్టి కార్యాచరణను సిద్దం చేసుకుని ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

 

వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం జిల్లా పార్టీ కార్యాలయంలో న్యాయపరంగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయవాదులను, రెవెన్యూ పరంగా అవసరమైన వాటి కోసం రిటైర్డ్ తహశీల్దారును ఏర్పాటు చేస్తున్నామని, దీంతో సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.

 

ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అనంతరం ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని, గతంలో మా సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపై పుల్లనీళ్లపల్లిలో దాడి జరిగిందని, ఆయన మంత్రి అయ్యాక కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.

 

ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ది కోసం, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సంక్షేమం కోసం తాను బాధ్యత తీసుకుంటున్నానని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

Post midle

Comments are closed.