నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరం లో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలు తో ప్రజలు హడలిపోతున్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలో నీ వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నే దొంగలు టార్గెట్ చేశారు. వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కవగా ఉండడం,శివారు ప్రాంతం దీనిలో కలిసి ఉండడం తో దొంగలు విజ్రంభిస్తూ న్నారు. దీనితో పోలీసులు ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ఎక్కడకి అయినా వెళ్ళినప్పుడు సమాచారం ఇవ్వాలని తెలిపేరు. ఎవరైనా కొత్త వ్యక్తులు తిరిగిన, ఏదైనా అసా oఘిక కార్యక్రమల పై సమాచారం ఉంటే తెలపాలని పోలీసులు సూచిస్తున్నారు. గత రెండు రోజులుగా నగర డి.ఎస్.పి జే. శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నగర పోలీసులతో సమావేశం నిర్వహించారు . నేర నియంత్రణ కు తీసుకోవాల్సిన చర్యలు పై ప్రణాళికను సిద్ధం చేశారు. నేరాలను నియంత్రించే ప్రక్రియలో భాగంగా ఒక స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశారు. అలానే నేరాల అధికంగా జరిగే ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని, పాత నేరస్తుల పై నిఘా పెట్టాలని, వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని నగర డి.ఎస్.పి జె శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
Comments are closed.