
తిరుపతి : విశాఖ ఉక్కు… ఆంధ్రుల హక్కు… అంటూ నలుదిక్కులూ పిక్కటిల్లేలా ఒక్కపెట్టున సాగిన ఉద్యమం… పోరుబాట పరిణామాల్లో ఏకంగా 32 మంది చేసిన ప్రాణత్యాగాలు… విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని తెలుగు నేలకు అందించాయి. ఇప్పుడు 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20 వేల మంది ఒప్పంద సిబ్బందితో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా, నవరత్న కర్మాగారంగా అలరారుతోంది. విశాఖ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఉక్కు కర్మాగారమే. అంతటి ఘనత వహించిన పరిశ్రమను ప్రైవేటుపరం చేయడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాణాలొడ్డి సాధించుకున్న ‘హక్కు’ విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో రా
రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అన్ని రాజకీయ పార్టీలు కర్మాగారాన్ని ఎక్కడికి తరలించడానికి వీల్లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేంద్రంతో ఢీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు అయినా నా విపక్షాలకు అవకాశం లేకుండా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ……...
*ప్రజా ఉద్యమంతో పుట్టిన ‘విశాఖ ఉక్కు’ పరిశ్రమను కేంద్రం అమ్మాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది :
*రాష్ట్ర విభజన హక్కు చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం ఎలాగు ఒక స్టీల్ ప్లాంట్ కేటాయించాలి :
*ఎవరికో ప్రైవేటీకరణతో కట్టబెట్టడం బదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుతత్వానికే ఇవ్వమని కోరుతున్నాం*
*విశాఖ ఉక్కు పరిశ్రమ అప్పులు కేంద్రమే భరించాలి*

*అప్పులు, కేటాయింపులు లెక్కబెట్టి మాకొచ్చేది మాకు ఇవ్వాల్సిందే*
*ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ఉక్కు కర్మాగారంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నే ఇవ్వొచ్చు*

*ముఖ్యమంత్రి గారికి కూడా పరిశ్రమల శాఖ తరపున ఈ ప్రతిపాదనను వివరిస్తాం*
*ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు రావ్వాల్సిన స్టీల్ ప్లాంట్ సహా అనేక అంశాలపై కేంద్రం ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదు.*
*ప్రజా ఉద్యమంతో ఏర్పాటైన ఆ ఒక్క ‘ఉక్కు’ను కూడా ప్రైవేటీకరణ చేయాలనుకోవడం సమంజసం కాదు*
Comments are closed.