సూర్యాపేట: విద్యుత్ బిల్లు 2020 తో రైతులు కూడా నష్టపోతారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ బిల్లు 2020పై విద్యుత్ శాఖ మంత్రుల అభిప్రాయం అడిగారని, తనని కూడా అడగగా.. ఆ బిల్లు తాము వ్యతిరేకమని తెలిపామన్నారు.
తెలంగాణతో పాటూ మిగతా రాష్ట్రాలూ విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా.. బిల్లులోని ఒక్క లైను కూడా మార్చలేదని అన్నారు. ఈ తాజా కేంద్ర బిల్లుతో వినియోగదారులకు ఉపయోగమేమీ లేదని అన్నారు. పైగా గృహ వినయోగదారులు సబ్సిడీ కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు.
Comments are closed.