The South9
The news is by your side.
after image

సోమిరెడ్డి పై సెటైర్లు విసిరిన కాకాణి

post top

నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పాల్గొన్న ముత్తుకూరు, టి.పి.గూడూరు వైయస్సార్సీపీ మండల కన్వీనర్లు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, శంకరయ్య గౌడ్ వైయస్సార్సీపీ అధికార ప్రతినిధులు మందల వెంకట శేషయ్య, తలమంచి సురేంద్ర బాబు, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్.

? సోమిరెడ్డిని సరిగా గౌరవించడం లేదని పాపం..!, ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాపై బాధ పడ్డారు.

? మాకు సోమిరెడ్డి పై అపార గౌరవం ఉంది. సోమిరెడ్డిని గౌరవనీయులు.., పూజ్యులు…, మహనీయులు, అని పిలువాలనిపిస్తున్నా, ఆయన చేస్తున్న గలీజు పనుల వల్ల నోరు రావడం లేదు.

? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు ఏం చేయ్యాలనే దాని మీద గౌరవనీయులు సోమిరెడ్డి గారు మాకు సలహాలు, సూచనలు ఇవ్వవలసిన అవసరం లేదు.

? మహానుభావుడు సోమిరెడ్డి గారు తాను అధికారంలో ఉన్నప్పుడు మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి రైతుల కడుపు కొట్టకుండా ఉండుంటే బాగుండేది!.

? పూజ్యులు సోమిరెడ్డి గారు రైతు రథంలో కమీషన్లు నొక్కేసి, రైతులకు అన్యాయం చేయకుండా ఉండుంటే బాగుండేది!.

? త్యాగశీలి సోమిరెడ్డి గారు నకిలీ ఎరువులు తయారు చేసి, రైతులకు అందించి మోసం చెయ్యకుండా ఉండుంటే బాగుండేది.

Post midle

? మహనీయులు సోమిరెడ్డి గారు నీరు – చెట్టు పనులలో పనులు చేయకుండానే బిల్లులు దిగమింగకుండా ఉండి ఉంటే రైతులకు న్యాయం జరిగేది.

? పవిత్రులు సోమిరెడ్డి గారు క్రికెట్ కిట్లు అమ్ముకొని ఆటలాడుకునే చిన్న పిల్లలకు అన్యాయం చేయకుండా ఉండుంటే బాగుండేది!.

? పెద్దలు సోమిరెడ్డి గారు యాష్ పాండ్ లలో అవినీతి ఈత కొట్టకుండా ఉండుంటే బాగుండేది!.

? సహృదయులు సోమిరెడ్డి గారు పసుపు కుంభకోణంలో పసుపు బదులు మట్టి కొనుగోళ్లు చేయకుండా ఉండుంటే బాగుండేది!.

? చీమకు కూడా హాని తలపెట్టని అహింస వాది సోమిరెడ్డి గారు సర్వేపల్లిలో స్కూళ్లు బిల్డింగ్ కూల్చివేయడం, పేదల ఇల్లు తొలగించడం, రైతులు వెళ్లే బ్రిడ్జీలను కూల్చివేయడం లాంటి పనులు చేయకుండా ఉండుంటే బాగుండేది!.

Post Inner vinod found

? సరసుడైన సోమిరెడ్డి గారు విలేకరుల సమావేశంలో తిట్లు కూడా సరసంగా ఉండాలని వ్యక్తం చేయడం ద్వారా ఆయనెంత సరసుడో తెలుసుకోవచ్చు.

? సరసుడైన సోమిరెడ్డిని “సరస శృంగార కోవిదుడు సోమిరెడ్డి చంద్రమోహనుడు” అని పత్రికలలో పతాక శీర్షికన బిరుదులు ప్రదానం చేయడం ఆయన హృదయానికి తార్కాణం.

? శృంగార కోవిదుడైన సోమిరెడ్డి శ్రీనివాస్ మహల్ లో మహిళల జోలికి వెళ్లి చెప్పు దెబ్బలు తినకుండా ఉంటే గౌరవంగా ఉండేది.

? మృదుభాషిగా తనను తాను భావించుకునే మహనీయుడు సోమిరెడ్డి గారు రమణదీక్షితులు గారిని “బొక్కలో వేసి నాలుగు తగిలియ్యండి….” అని అనకుండా ఉండి ఉంటే బాగుండేది!.

? సహృదయుడిగా తనకు తాను అనుకునే సోమిరెడ్డి గారు బహిరంగ సభలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ను “యూస్ లెస్ ఫెలో” అనకుండా ఉండుంటే బాగుండేదేమో!.

? అవినీతికి ఆమడ దూరంలో ఉండే నీతిమంతుడైన సోమిరెడ్డి గారు రాజకీయాలలో తాను సంపాదించుకున్న ఆస్తిపాస్తులను ఒక్కటి కూడా తనవి అని చెప్పుకోకుండా తన కుమార్తెవి, తన కుమారుడివి, తన బంధువులవి అని చెప్పుకునే నిస్వార్ధ ప్రజా సేవకుడు.

? స్వతహాగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సోమిరెడ్డి గారు తాను అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్క అవినీతి కార్యక్రమంలో ఒక్కొక్క “డాక్టరేట్” చొప్పున అందుకోగల సమర్థులు.

? నిష్కలంక ప్రజా సేవకుడైన సోమిరెడ్డి గారు గెలిచి ఊరేగడమే కాకుండా, ఓటమిపాలైన తర్వాత కూడా గ్రామాలలో తాను గడించిన అవినీతిని గుర్తు చేసుకుంటూ ఆయన ఫ్లెక్సీలను గ్రామ, గ్రామాన ఊరేగించడం అనితర సాధ్యమైన విషయం.

? ప్రకృతి ప్రేమికుడైన సోమిరెడ్డి గారు సిలికా మైన్లు, గ్రావెల్ మైన్లను కొల్లగొట్టకుండా ఉండుంటే బాగుండేది!.

? నీతికి, అవినీతికి జరుగుతున్న సంఘర్షణలో నలిగిపోతున్న నీతిమంతుడు సోమిరెడ్డి గారు తాను నీతిమంతుడని, అవినీతికి పాల్పడలేదని ఒక్కసారి కాణిపాకం వినాయకుని దగ్గర గానీ, వెంకయ్య స్వామి వద్ద గానీ ప్రమాణం చేస్తే బాగుంటుందేమో!.

? నీతికి, నిజాయితీకి నిలువుటద్దమైన సోమిరెడ్డి గారు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కేటాయించినందుకు కడు పేదవారి నుండి ఆయన కైంకర్యం చేసిన డబ్బు తిరిగి వారికి చెల్లిస్తే మంచిదేమో!.

? గౌరవనీయులైన సోమిరెడ్డి గారిని ఎంత గౌరవప్రదంగా మాట్లాడాలనుకున్నా, ఆయన పట్ల మాకు బోలెడు సానుభూతిని ఉన్నా…, పాపం! ఆయన చేస్తున్న చండాలపు పనుల వల్ల ఆయన ఆశించిన స్థాయిలో మేము ఆయనను గౌరవించలేక పోతున్నామని.., గమనించాలని కోరుతున్నాం.

? కీర్తిధారి సోమిరెడ్డి గారు ఇకమీదటైనా, మంచి పనులు చేసే అవకాశాలు లేకపోయినా, ఎదుటివారిని అనవసరంగా విమర్శించకుండా తన కీర్తిప్రతిష్ఠలు ఇనుమడింప చేసుకునే విధంగా ప్రవర్తించేందుకు భగవంతుడు ఆశీస్సులందించాలని ప్రార్థిస్తున్నా.

Post midle

Comments are closed.