The South9
The news is by your side.
after image

సోషల్ మీడియా పై కళ్లెం.. కొత్త నిబంధనల ను ప్రకటించిన కేంద్రం

post top

*సోషల్‌ మీడియాలో హద్దులు మీరిన స్వేచ్ఛకు అడ్డుకట్ట: కేంద్రం*

*ఓటీటీ ప్లాట్‌ఫాంలపై నియంత్రణ సంస్కరణలు తెచ్చిన కేంద్రం*

*ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఇష్టానుసార వీడియోలు ఇక కుదరదు: కేంద్రం*

*ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ఇంటర్నెట్ మీడియా, సోషల్ మీడియాలో వస్తోన్న కంటెంట్‌ను నియంత్రించే వ్యూహంలో భాగంగా కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సంబంధిత చట్టాన్ని సవరించడం ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫాంలపై నియంత్రణకు కేంద్రం తాజా సంస్కరణలను గురువారం ప్రకటించింది.*

*అభ్యంతరకరమైనమార్ఫింగ్ పోస్టులను తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే పాటించాలి. లేదంటే ఆయా సదరు సంస్థలకు నోటీసులు ఇవ్వనుంది .ఓటిటి, సోషల్ మీడియాకు కళ్లెం వేసిన కేంద్రం మూడు అంచెల నియంత్రణ విధానాన్ని అమలు చేయనున్నామని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌ ప్రకటించారు.*

*ఫిబ్రవరి 25 న విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తుల మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) 2021 నిబంధనల ప్రకారం, ప్రభుత్వం లేదా చట్టపరమైన ఉత్తర్వుల తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొలగించాలి. 36 గంటలవరకు వేచి ఉండకూడదు. ఈ కంపెనీలు అధికారుల నుండి అభ్యర్థించిన 72 గంటలలోపు దర్యాప్తునకు సమాచారం, సహాయం అందించాలి. వెబ్‌సిరీస్‌లలో క్రియేటివిటీ పేరిట హద్దులు మీరిన శృంగారం చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.కేంద్ర ఐటి మంత్రిత్వశాఖ తాజా ఆదేశాల ప్రకారం ఆయా సంస్థలు భారత్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. అలాగే చట్టాలు అమలుకు, ఉల్లంఘనపై చర్యలకు సంబంధిత అధికారులను నియమించుకోవాలి. ఫిర్యాదులను పరిష్కరించే అధికారులు 24/7 గంటలు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండాలి*

*ముఖ్యమైన విషయాలు:*

Post midle

● *సోషల్ మీడియా ప్లాట్‌ఫాం డేటా ,కంటెంట్‌ను వినియోగదారుల ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలి.*

● *అభ్యంతరకరమైన గుర్తించిన తరువాత పోస్టును 24 గంటల్లో తొలగించాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయి.*

● *ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఇష్టానుసార వీడియోలు పోస్ట్‌ చేయరాదు.సోషల్‌ మీడియాలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి.*

Post Inner vinod found

● *నోడల్ ఏజెన్సీ ద్వారా 24 గంటలు పనిచేస్తూ పర్యవేక్షిస్తుంది. ఫిర్యాదులను అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది.*

*●ఈ నిబంధనలను ప్రచురించిన తేదీ నుండి 3 నెలల్లోపు చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ (సీసీఓ) ను నియమించాలి.*

● *చట్టానికి,నిబంధనలకు సీసీఓ బాధ్యత వహించాలి.*

*ఓటిటీ లో ఐదు అంశాలు బ్లాక్*

● *అసభ్య, అశ్లీల, హింసాత్మక కంటెంట్ పై నిషేధం*

● *వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా ఓటీటీ విభజన*
*సామాజిక ఉద్రిక్తతలు పెంచే కంటెంట్ పై నిషేధం*

● *సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే పై నిషేధం*

● *మహిళలు, చిన్నారులు, దళితులను అవమానించే కంటెంట్‌పై నిషేధాజ్ఞలు*

*●జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసే కంటెంట్ పై కొనసాగనున్న నిషేధం*

*సోషల్ మీడియాలో అసత్య ప్రచారం పై నియంత్రణ*

*అసత్య ప్రచారం ప్రారంభం చేసే తొలి వ్యక్తి వివరాలు ఖచ్చితంగా వెల్లడించాలి*
*కాగా ఇటీవల రైతు ఉద్యమం నేపధ్యంలో కొన్ని హ్యాష్ ట్యాగ్‌లను వాడకుండా నియంత్రించాలని ట్విటర్‌ను కేంద్రం కోరగా ట్విటర్‌* *ఆదేశాలను పాక్షికంగా పాటించడం వివాదానికి దారి తీసింది. దీనికి తోడు అంతకుముందు, వాట్సాప్ గోప్యతా విధానంలో,* *వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునే విషయం కూడా తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కూడా* *నిబంధనలపై వివక్ష చూపుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక చట్టాలను రూపొందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. తద్వారా కొత్త నిబంధనలతో, బిగ్ టెక్ సంస్థలను నియంత్రించాలని చూస్తున్న ఇతర వివిధ దేశాలలో భారత్ కూడా చేరింది.*

Post midle

Comments are closed.