
తమిళనాడు లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే పార్టీలు తమతమ వ్యూహాలలో నిమగ్నమయ్యాయి. థర్డ్ ఫ్రంట్ అనే మాట చాలా కాలంగా వినిపిస్తున్న టువంటి మాటే. గతంలో మూడు సార్లు ఓటమిపాలైన థర్డ్ ఫ్రంట్ మరలా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో అధికారంలోకి ప్రధాన పార్టీలు రావాలంటే 80 నుంచి 90 శాతం సీట్లను వారు తీసుకుని మిగతావి మిత్రపక్షాలకు కేటాయించేవి.
ఈ పరిస్థితుల్లో కొన్ని అవకాశం లేక సర్దుకు పోతుండగా మరికొన్ని మూడో కూటమి గా అడుగులు వేసేవి. ఈ నేపథ్యంలో మరొక్కసారి కొన్ని పార్టీలో ముఖ్యంగా ప్రముఖ నటుడు శరత్ కుమార్ పార్టీ ‘ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి ‘ కి పరిమిత సీట్లు కేటాయించడంతో నచ్చక మూడో కూటమి లో చేరారు. ఈ కూటమిలోకి మరొక పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా లోకి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మిగతా పక్షాలు కమల్ హాసన్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి అంగీకారం కుదిరినట్లు సమాచారం. అయితే , రెండు ప్రధాన పార్టీల సీట్లు కేటాయింపు తర్వాత నిర్ణయం తీసుకోవాలని కమల అన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో శశికళ దినకరన్ నేతృత్వంలోని ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ పార్టీని మూడో కూటమిలోకి పిలవద్దని కమల్ కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడో కూటమి నేతలతో మాట్లాడి , కూటమి వద్దని చెప్పిన కూటమి నేతలు అంగీకారం తెలపలేదని , అమిత్ షా మాట వారు వినలేదని తెలుస్తోంది.
Comments are closed.