
చెన్నై కేంద్రంగా నడుస్తున్న ఆధ్యాత్మిక కేంద్రం “జీసస్ కాల్స్”సంస్థ వ్యవస్థాప కులు డి. జి. ఎస్. దినకర్ కుమారుడు, పాల్ దినకర్ కి చెందిన 28 ఆస్తులపై ఈరోజు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. వీరికి చెందిన కారుణ్య ఇంజినీరింగ్ కాలేజ్ పాండిచ్చేరి లో కలదు. చెన్నై లోని జీసస్ కాల్స్ ,కార్యాలయం,మరియు పాండిచ్చేరి లోని కారుణ్య ఇంజినీరింగ్ కాలేజ్ లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు .దీనికి సంభందించిన లెక్కల వ్యవహారాలా లేక ఇంకా ఏమైనా అనేది తెలియాల్సి ఉంది. ఈమధ్య తమిళనాడు లో సంక్రాంతి సందర్భంగా ఒక వేడుకలో పాల్ దినకర్ కుటుంబం పాల్గొన్నారు. దీని మీద కొంత మంది విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ లేనిది కొత్తగా ఇలా వేడుకలో పాల్గొనడం కొంత మంది కి రుచించలేదు. ఈ నేపధ్యంలో ఈ రోజు ఐటీ దాడులు జరగడం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
Comments are closed.