
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య టీజర్ నిన్న సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది చిత్రబృందం. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తూ తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఆచార్య చిత్రంపై అభిమానుల లో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఆచార్య టీజర్ ఉందని అభిమానులు అంటున్నారు. చిరంజీవి తన పాత సినిమాల్లో మాదిరిగా ఉండడం, భారీ పోరాట దృశ్యాలు, దేవాలయం సెట్టింగ్ తో పాటు చూడ చక్కని గ్రాఫిక్స్ తో ఆకట్టుకుంది ఆచార్య టీజర్. చివరగా చిరంజీవి నోటివెంట పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు, బహుశా గుణపాఠాలు చెప్తాను ఏమో అనే డైలాగుతో టీ జర్ ని ముగించారు దర్శకులు. ప్రస్తుతం సామాజిక మాధ్యమం లో ఆచార్య టీజర్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా కొనసాగుతుంది. ఒక్కరోజు వ్యవధిలోనే ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు తెలియజేసింది చిత్రబృందం.

Comments are closed.