
*:కేంద్ర టూరిజం శాఖ మంత్రిని కలిసిన మేకపాటి విక్రమ్ రెడ్డి*
*:రూ.6384.00 లక్షలతో ప్రతిపాదనలు*
*:సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి*
*ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నేడు హైదరాబాదులో కేంద్ర టూరిజం మరియు సాంస్కృతిక అభివృద్ధి శాఖా మంత్రివర్యులు కిషన్ రెడ్డి ని కలవడం జరిగింది.*

*ఆత్మకూరు నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధి కొరకు రూ.6384.00 లక్షలతో ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది.*
*ఈ ప్రతిపాదనలో సంగం గ్రామంలో రూ.979.13 లక్షలు, అనుసముద్రంపేట దర్గా రూ.507.24 లక్షలు, కోటితీర్థం శివాలయం రూ.323.37 లక్షలు, ఆత్మకూరు ట్యాంక్ బ్యూటిఫికేషన్ రూ.800.00 లక్షలు, అనంతసాగరం ట్యాంక్ బ్యూటిఫికేషన్ రూ.1000.00 లక్షలు మరియు సోమేశ్వర దేవాలయం సోమశిల రూ.1357.94 లక్షలతో మంజూరు చేయవలసిందిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కోరారు.*
*ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలో ఆత్మకూరు నియోజకవర్గంలో టూరిజం కింద అవసరమైన పనులను మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.*

*ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.*
Comments are closed.