
వాషింగ్టన్: భారత్ కోవిడ్ విషయంలో తప్పుడు అంచనా వేసిందని ప్రముఖ అమెరికా అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌచీ అన్నారు. కరోనా సంక్షోభం పూర్తిగా తొలగి పోయింది అని భావించి అన్ని రకాల మార్కెట్లు, వ్యాపారాలు మొదలుపెట్టడంతో కరుణ తీవ్ర రూపం దాల్చిందని ఫౌచీ తెలిపారు. అమెరికా సెనేట్లో జరిగిన కోవిడ్ పై భారత్ సన్నద్ధతకు సంబంధించిన కార్యక్రమంలో విద్య ,వైద్యం, కార్మిక, కమిటీల ముందు తన అభిప్రాయాలను వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ ని ముందుగానే గుర్తించలేదని , ప్రజలు కూడా ,నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వలనే ఈ విధమైన పరిస్థితి నెలకొందని అన్నారు. ముందుగా అంచనా వేయనందు వలన చాలా రాష్ట్ర ల్లో సరిపడా, ఆస్పత్రిలో,సిబ్బంది, టీకాలు, ఆక్సిజన్ ,పడకలు, సమకూర్చుకోలేక పోయారని దానివలన మరింత నష్టం జరిగింది అని ఫౌచీ అన్నారు.
Comments are closed.