
ఈ ప్రపంచ మంతా ఎప్పుడు చూడనటువంటి విపత్తు కరోనా రూపంలో వచ్చింది. గత 100 ఏళ్ల లో ఎవ్వరు కూడా ఇటువంటి పరిస్థితి ని చూసిన దాఖలాలు లేవు. ఒక్క సారిగా ప్రపంచ మంతా స్థంభించి పోయింది. ప్రముఖులు దగ్గర నుంచి సామాన్యుల వరకు కరనో కాటు కు ఎంతో మంది బలి అయ్యారు. ఎంతో మంది తమ ఉన్న ప్రాంతాల నుంచి వారి ప్రాంతాల్లో కి వెళ్ల లేక నడక బాట పట్టిన పరిస్థితులు అనేకం. ఆకలి బాధలు, ఆర్ధిక ఇబ్బందులు తో తల్లడిల్లినారు ప్రజలు.

లాక్ డౌన్ అంటే ఇలా ఉంటుందా అనేది కూడా మొదట సారి చూసి న పరిస్థితి…. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఇప్పుడే పరిస్తితి లు చక్కబడుతున్నాయి అని అనుకుంటున్నారు ప్రజలు. ఒక పక్క వ్యాక్సిన్ వస్తుంది అనే ఆశ ఉన్నప్పటికీ అది ఎంత వరకు సఫలీకృతం అవుతుంది అనేది చూడాలి. ఈ మధ్య నే మరల స్ట్రెయిన్ అనే కరోనా రూపాంతరం చెందిన వైరస్ బ్రిటన్ లో ఉదృతంగా ఉన్నదనే విషయం తో చాలా దేశాలు అంతర్జాతీయ విమానా రాకపోకలను నిషేధం విధించి నారు. ఇలా 2020 ఒక పీడ కల గా ఎన్నో నేర్పి వెళ్ళింది మన అందరికి. దాని నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తలు తీసుకొని 2021 లో అందరూ సుఖ సంతోషాలు తో ఉండాలని అన్ని రంగాల అభివృద్ధి లోకి రావాలని కోరుకుంటూ…. ఎడిటర్
Comments are closed.