The South9
The news is by your side.
after image

మా మనోభావాలు దెబ్బతీసేలా నిమ్మగడ్డ వ్యవహరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

post top

తాడేపల్లి

వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్‌మీట్ లో మాట్లాడుతూ

– నిమ్మాడలో నామినేషన్ వేసే అభ్యర్థిని అచ్చెన్నాయుడు బెదరించాడు
– నామినేషన్ వేయనివ్వకుండా టిడిపి దౌర్జన్యం చేసింది
– అచ్చెన్నాయుడి బెదరింపును రాష్ట్ర ప్రజలు చూశారు.
– దీనిపై చట్టప్రకారం పోలీసులు కేసు పెడితే కక్షసాధింపు అంటారా?
– టిడిపి దౌర్జన్యాలకు పాల్పడుతూ మాపై బురదచల్లుతోంది
– ముందు నిమ్మగడ్డ మాట్లాడతారు… తరువాత దానిపై చంద్రబాబు స్పందిస్తారు
– చిత్తూరు పర్యటనలో చంద్రబాబుపై వున్న ఓటుకునోటు కేసు గురించి నిమ్మగడ్డ మాట్లాడాలి
– నిఘా పేరుతో ఎస్‌ఇసి విడుదల చేస్తున్న యాప్ ఎవరు తయారు చేశారు?
– ఎస్‌ఇసి ఒక ప్రైవేటు వ్యక్తితో ఈ యాప్‌ను తయారు చేయించింది
– ఈ యాప్‌ను టిడిపినే తయారు చేయించింది.
– మా మనోభావాలను దెబ్బతీసేలా గవర్నర్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారు
– అందుకే ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చాం
– చివరికి గవర్నర్‌ను కూడా బెదరించే దోరణితో నిమ్మగడ్డ లేఖ రాశారు

Post Inner vinod found

పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతూ… తిరిగి వైయస్‌ఆర్‌సిపిపై బురదచల్లుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిమ్మాడలో నామినేషన్ వేసేందుకు ప్రయత్నించిన అప్పన్నపై అచ్చెన్నాయుడు ఏ రకంగా బెదరింపులకు పాల్పడ్డాడో రాష్ట్ర ప్రజలు గమనించారని అన్నారు. మరోవైపు అసలు నామినేషన్ దాఖలు చేయనివ్వకుండా ఏ రకంగా అచ్చెన్నాయుడి అనుయాయులు దౌర్జన్యాలకు దిగారో అందరూ చూశారని అన్నారు. దీనిపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని, టిడిపి అందుకు భిన్నంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అచ్చెన్నాయుడి బెదరింపులపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే… దానిని చంద్రబాబు కక్షసాధింపు అంటారా అని మండిపడ్డారు. ప్రతి దానిని రాజకీయం చేస్తూ మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక దళిత తహసిల్థార్ పట్టాలు పంపిణీ చేస్తుంటే… ఆమెపై తెలుగుదేశం నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు. ఒకవైపు దళితులు తమ పార్టీ బలపరిచే వారికి ఓటు వేయాలంటూ చంద్రబాబు ప్రచారం చేస్తూ, మరోవైపు దళిత అధికారులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు.

*’నిఘా యాప్ టిడిపి తయారు చేయించిందే’*
ఎన్నికల కమీషనర్ చెబుతున్న నిఘా యాప్ తెలుగుదేశం వారు తయారు చేయించిందేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఒక ప్రైవేటు వ్యక్తితో ఈ యాప్‌ను తయారు చేయించినట్లు తమకు సమాచారం వుందని అన్నారు. ఈ యాప్ గురించి ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఈ యాప్ విడుదలైన తరువాత దానిని పరిశీలిస్తామని, దానిలో పొందుపరిచే వీడియోలు, ఫోటోలను మార్ఫింగ్ చేసే అవకాశం వుందా లేదా అనేది కూడా గమనిస్తామని అన్నారు.

*చిత్తూరు పర్యటనలో చంద్రబాబు గురించి చెప్పాలి*
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌ చిత్తూరు జిల్లాలో పర్యటించే సందర్భంగా చంద్రబాబు గురించి కూడా మీడియాకు చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు వుందని, ఆయన వద్ద తాను సెక్రటరీగా పనిచేశానని ధైర్యంగా చెప్పగలడా అని ప్రశ్నించారు. రాజ్యాంగపదవిలో వున్న నిమ్మగడ్డ ఏ రకంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడో ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. దేనిమీద అయినా ముందు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ మాట్లాడతారని, తరువాత దానిపై చంద్రబాబు స్పందిస్తున్నాడని అన్నారు.

*మా మనోభావాలను దెబ్బతీసేలా నిమ్మగడ్డ వ్యవహరించారు*
సీనియర్ ఎమ్మెల్యేలు వుంటూ, ఈ ప్రభుత్వంలో మంత్రులుగా వున్న తనపైన, మంత్రి బొత్స సత్యనారాయణ పైనా కించపరిచేలా నిమ్మగడ్డ రమేష్ గవర్నర్‌కు లేఖ రాశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఆ లేఖలోనూ గవర్నర్‌ను సైతం బెదిరించేలా ఆయన రాతలు వుండటం దారుణమని అన్నారు. అందుకే మా హక్కులను కాపాడుకునేందుకు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. చట్టప్రకారమే ప్రివిలేజ్ కమిటీ దానిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు సభ్యుల హక్కులను ప్రివిలేజ్ కమిటీ కాపాడిందని, బాధ్యుడైన ఎస్‌ఇసిపై చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.

Post midle

Comments are closed.