
*నెల్లూరు*
గ్రావెల్, ఇసుక మాఫియాపై చర్యలేవీ..మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా పేట్రేగిపోతోంది..
కొందరు అధికారులు మాఫియాతో చేతులు కలపగా మరికొందరు భయపడి పట్టించుకోవడం మానేశారు..
అక్రమ మైనింగును నిజాయతీగా ప్రశ్నించిన గూడూరు వీఆర్వో హనుమంతరావు మాత్రం దాడికి గురై ఆస్పత్రి పాలయ్యాడు..
కావలి నుంచి తడ వరకు ఇసుక, గ్రావెల్, తువ్వమట్టితో పాటు విలువైన ఖనిజ సంపదను మాఫియా అక్రమంగా కొల్లగొడుతోంది..

సామాన్య ప్రజల అవసరాలకు ట్రక్కు ఇసుక దొరకడం కష్టంగా ఉంటే మాఫియా మాత్రం నిత్యం వందల ట్రక్కుల ఇసుకను తవ్వి తరలించేస్తోంది…

ప్రభుత్వ లేఅవుట్ల పేరుతో పబ్లిక్ గా ప్రైవేటు అవసరాలకు గ్రావెల్, తువ్వమట్టి తరలిస్తున్నా అధికారులు ప్రేక్షపాత్ర పోషించడం దురదృష్టకరం..
గ్రావెల్ కోసం కక్కుర్తిపడి వెంకటాచలం లాంటి పారిశ్రామిక ప్రాంతంలో పోర్టు, హైవేకి సమీపంలోని విలువైన భూముల్లో బావులు, గుంతలు పెట్టేస్తున్నారు..
ప్రకృతి సంపదను పట్టపగలే దోచుకుంటున్నా చర్యలు తీసుకోలేని నిస్సహాయస్థితిలో అధికారులుండటం బాధాకరం..
మైనింగ్ మాఫియాను వెనకుండి నడిపిస్తున్న వైసీపీ పెద్దల గుట్టును జిల్లా ఉన్నతాధికారులు బయటపెట్టాలి..
వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు దోచేసిన సొత్తుకు సంబంధించి రికవరీ చేయాలి అని అన్నారు.
Comments are closed.