
ప్రభాస్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రాధేశ్యాం’చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ని ప్రేమికుల రోజును పురస్కరించుకొని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది చిత్రబృందం. చక్కని లొకేషన్లలో పాత కాలపు యూరప్ లొకేషన్లల ను చక్కగా కనిపించేలా దర్శకుడు చిత్రీకరించారు. అలానే హీరోయిన్ ని ప్రభాస్ పలకరించే భాష స్పానిష్ పదాలతో మాట్లాడించడం, దానికి హీరోయిన్.. నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా అనగానే ప్రతిస్పందనగా……. ప్రభాస్.. వాడు ప్రేమ కోసం చచ్చాడు నేను ఆ టైప్ కాదు అంటూ చాలా స్టైలిష్ గా డైలాగ్ చెప్పడం ప్రభాస్ అభిమానులు అలరించింది అనే చెప్పొచ్చు. మొత్తానికి ప్రేమికుల దినోత్సవం రోజున ప్రభాస్ అభిమానులు ఆనందించేలా చిత్ర బృందం రిలీజ్ చేసిన రాధేశ్యాం గ్లింప్స్ ఆకట్టుకుంటోంది

Comments are closed.