
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఇంగ్లిష్ మీడియం అమలు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో ఎస్‌ఎల్‌పీ, స్టేపై ప్రతివాదులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 25కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన జీవో నెం.81, 85ను హైకోర్టు కొట్టేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు విచారించి స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ చర్య జాతీయ విద్యా విదానానికి వ్యతిరేకంగా ఉందని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది.
Comments are closed.