
చెన్నై ప్రతినిధి: తమిళనాడులో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైనట్టు కనిపిస్తుంది. ఇంకా మూడు నెలల సమయంలో లో ఆ సెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరి వ్యూహరచనలో వారు నిమగ్నమయి ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ ఈరోజు చెన్నై పర్యటన ఆసక్తిగా మారింది. గత కొన్ని గంటల ముందే శశికళ హోసూర్ నుంచి చెన్నైకి రోడ్డు మార్గాన బయలుదేరారు. అయితే శశికళ వర్గం ఈ పర్యటన ని భారీ స్థాయిలో నిర్వహించడానికి ముందుగానే ప్రణాళికలు వేసుకున్నారు కానీ ప్రభుత్వ ఒత్తిడితో ఐదు వాహనాలకు మాత్రమే పోలీసు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రయాణానికి అడుగడుగున ఆటంకాలు ఏర్పరస్తున్నారని పోలీసులకు కార్యకర్తలకు వాగ్వాదం తో గంటకుపైగా శశికళ కాన్వాయ్ జుజువాడి చెక్ పోస్ట్ ఆగి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో పైకి గంభీరంగా కనిపిస్తున్న ముఖ్యమంత్రి పళని స్వామి, లోలోపల అలజడి అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే అన్నాడీఎంకే కార్యకర్తల ఎవ్వరిని వెళ్లకూడదని ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. అయితే శశికళ వర్గం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈరోజు శశికళ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
Comments are closed.