The South9
The news is by your side.
after image

ప్రతిపక్ష పార్టీ మెనిఫెస్టో కూటమి పార్టీకే నచ్చలేదు: ఎమ్మెల్యే మేకపాటి.

post top

*ప్రతిపక్ష పార్టీ మెనిఫెస్టో కూటమి పార్టీకే నచ్చలేదు: ఎమ్మెల్యే మేకపాటి*

*: జగనన్న సంక్షేమ మెనిఫెస్టోపై ప్రజలందరికి నమ్మకం* 

*: మే 13న జరిగే ఎన్నికల్లో ఆశీర్వదించండి* 

*: మర్రిపాడు మండలంలో ముమ్మర ఎన్నికల ప్రచారం*

 

గతంలో 600 హామిలిచ్చి ప్రజలను మోసం చేసిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మెనిఫెస్టోను ప్రజలు ఎవరూ మరిచిపోలేదు. మళ్లీ ఇప్పుడు నరికొత్త మెనిఫెస్టో అంటూ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ మెనిఫెస్టోను కూటమిలో బిజెపి పార్టీ నాయకులకే నచ్చలేదని, ఇది ఆ పార్టీ మెనిఫెస్టో తీరు అని, జగనన్న సంక్షేమ మెనిఫెస్టోపై ప్రజలందరికి నమ్మకం ఉందని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్లీ ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.

మంగళవారం మర్రిపాడు మండలంలోని కోనసముద్రం, డీసీపల్లి, ఖాన్సాహెబ్పేట, రామానాయుడుపల్లి, ఎస్సీ కాలనీ, రాంపల్లి గ్రామాలలో ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత డీసీవల్లిలోని శ్రీ పంచముఖ శక్తి గణవతి ఆలయం, శ్రీరామాలయాల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

 

Post midle
Post Inner vinod found

ఆయా గ్రామాలకు ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరిస్తూ పూలవర్షం కురిపిస్తూ తమ అభిమాన నాయకుడికి ఆహ్వనం వలికారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం తాను చేయగలిగిందే ఎప్పుడూ ప్రజలకు చెబుతారని, దానిని అనుసరించే సంక్షేమాన్ని రెట్టింపు చేస్తూ నూతన మెనిఫెస్టోను విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఆయన సారధ్యంలో ఎమ్మెల్యేగా ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రానున్న ఐదేళ్ల కాలంలో చేయగలిగిన పనులన్నింటిని వివరిస్తున్నామని, వాటన్నింటిని తప్పక పూర్తి చేస్తామని హామి ఇస్తున్నామని పేర్కొన్నారు.

 

గత ఐదు సంవత్సరాల కాలంలో ఆయా గ్రామాలకు అందచేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ది పనులను గురించి పూర్తి వివరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం కంటే వదింతల అభివృద్ధిని అందచేయడం జరిగిందన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని వివరించారు.

 

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కరోనా సమయంలో కూడా విస్తృతంగా సేవలందించడం జరిగిందని, టీడీపీ నాయకులు అనలు కనిపించలేదన్నారు. నాలుగు సంవత్సరాల పాటు పుష్కలంగా వర్షాలు పడి సుభిక్షంగా ఉన్న మన నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు లోకేష్ అడుగు పెట్టడంతో వర్షాలు వడక తీవ్ర దుర్భిక్ష్యంలోకి వెళ్లిపోయామన్నారు. గతంలో జరిగిన ఐఏబి సమావేశంలో ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగానికి సాగునీటిని అందనివ్వకుండా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ప్రయత్నం చేశారని, ఆ సమావేశం అనంతరం సీయం జగనన్ను కలిసి విన్నవించడంతో ఆరు టీయంసీల నీటిని విడుదల చేశారని, దీంతో రైతులు సుభిక్షంగా వంటలు వండించుకున్నారని పేర్కొన్నారు.

 

 

ఆత్మకూరు నియోజకవర్గంలో హైలెవల్ కెనాల్, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను పనులు పూర్తి చేస్తామని జగనన్న మాట ఇచ్చారని, మాట చెబితే తప్పక పూర్తి చేస్తారని అన్నారు. మెనిఫెస్టోలో జగన్ పెడితే తప్పక పూర్తి చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రకటించిన మెనిఫెస్టో పొత్తు పార్టీకే నమ్మకం లేదని, తమ ఫోటో కూడా వేయవద్దంటూ పక్కకు వెళ్లిపోయారని, అలాంటి మెనిఫెస్టో ప్రకటించడం జరిగిందని అన్నారు.

 

అలాంటి మెనిఫెస్టోను జగనన్న ప్రజలకు ఎప్పుడూ ఇవ్వరని, తాను చేస్తానన్న సంక్షేమాన్ని వివరిస్తూ మెనిఫెస్టోను విడుదల చేశారన్నారు. ప్రతిపక్ష పార్టీ పాలనకు, సీయం జగనన్న ప్రభుత్వ పాలనకు వ్యత్యాసాన్ని గమనించాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సంక్షేమ ప్రభుత్వాన్ని కొనసాగించేలా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్ధులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Post midle

Comments are closed.