The South9
The news is by your side.
after image

విశాఖ ఉక్కు పై రేపు జరుగుతున్న రాష్ట్ర బందుకు మా సంపూర్ణ మద్దతు.. మంత్రి పేర్ని నాని

post top

రేపటి (మార్చి 5) రాష్ట్ర బంద్ కు
రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు
రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)
సచివాలయం, మార్చి 4 : విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ప్యాక్టరీ కార్మికులు చేపట్టే రాష్ట్ర బంద్ కు తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కని ఆయన స్పష్టం చేశారు. సుదీర్ఘ పోరాటం ద్వారా 30 మందికి పైగా ఆంధ్రుల బలి దానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రజల ఆస్తిగానే ఉంచాలనేది తమ ప్రభుత్వ డిమాండ్ అని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయకుండా ప్రజల ఆస్తిగానే ఉంచేలా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోడికి సీఎం జగన్మోహన్ రెడ్డి రాత పూర్వకంగానూ తెలియజేశారన్నారు. కోట్లాది మంది తెలుగు ప్రజల ఆకాంక్షను మన్నిస్తూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రజల ఆస్తిగానే ఉంచాలని మంత్రి కోరారు. ధరలు అదుపులో ఉండాలంటే కొన్ని పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉండాల్సిందేనన్నారు. ఆర్థికంగా భారమైనా కార్పొరేషన్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత జగన్ సర్కార్ కు దక్కుతుందన్నారు.
నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగులు విధులకు హాజరవ్వాలి…
విశాఖ ఉక్కును ప్రైవేటు పరంచేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు పిలుపునిచ్చిన శుక్రవారం నాటి ఆంధ్ర బంద్ కు తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలుపుతోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజల అసవరాలను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం ఉదయం నుంచే డిపోలకు పరిమితమయ్యే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాకపోకలు సాగిస్తాయన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి విధుల్లో పాల్గొనే ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల ఆకాంక్షను గుర్తించి, విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలని మంత్రి పేర్ని నాని కోరారు.

Post midle

Comments are closed.