*ఏడీఎఫ్ ద్వారా అభివృద్ది చేసేందుకు భాగస్వాములు కండి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: పలు రంగాల్లో నిష్ణాతులైన ఎన్ జీఓలతో ఆత్మకూరు ఎమ్మెల్యే చర్చాగోష్టి*
ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ద్వారా అభివృద్ది పనులు, విద్య, వైద్యం, వ్యవసాయం, మౌళిక సదుపాయలు, పరిశ్రమలు, నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పన తదితర అంశాల్లో ఆత్మకూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించి భాగస్వాములు కావాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
తిరుపతిలోని ఐఐటీ కళాశాలలో రెండు రోజుల పాటు ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ద్వారా ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ది ప్రణాళికపై దేశ విదేశాలకు చెంది పలు రంగాల్లో నిష్ణాతులైన ఎన్ జీలతో ఎమ్మెల్యే మేకపాటి వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గంలో అవసరమైన అభివృద్ది పనులు చేసేందుకు నియోజకవర్గంలో ఉండి బయట దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారిందని ఒకే వేదికపైకి తెచ్చి ఏడీఎఫ్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా అభివృద్ది పనులు నిర్వహిస్తున్నామని అన్నారు.
అయితే పలు గ్రామాలలో చేపట్టబోయే అభివృద్ది పనులకు ఏడీఎఫ్ ద్వారా అవసరమైన నగదును సమకూర్చినప్పటికి ఆ అభివృద్ది ముందుకు సాగేందుకు ప్రణాళిక, కార్యాచరణ అవసరమని, ఇప్పటికే మీరు ఇలాంటి అభివృద్ది పనులు బయట ఎక్కడెక్కడో చేసి ఉన్నారు కాబట్టి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్దిలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ప్రధానంగా ఏడీఎఫ్ ద్వారా నియోజకవర్గంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటు చేసి సీడ్స్ సంస్థ ద్వారా వారికి అవసరమైన శిక్షణ అందిస్తున్నామని, అదే విధంగా ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోనేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వసతుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. మెట్ట ప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే రైతు సదస్సు నిర్వహించి అందులో అనుభవ్ణులైన వారితో రైతులకు ముఖాముఖి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అభివృద్ది, మౌళిక వసతుల కల్పనకు నియోజకవర్గానికి చెందిన అనేక మంది ముందుకు వస్తున్నారని, వాటిని కార్యరూపంలోకి తెచ్చేందుకు ఇప్పటికే అనుభవం కలిగిన మీ అందరి సహకారం అవసరమని తెలిపారు.
రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాపులో సీడ్స్ సంస్థ వ్యవస్థాపకులు ఆర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, ఐఐటీ, తిరుపతి కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణతో పాటు పలు ఎన్ జీఓలకు చెందిన ప్రముఖులు పాల్గొని మౌళిక వసతుల కల్పన, అభివృద్ది పనుల నిర్వహణ గురించి సమిష్టిగా చర్చించి సలహాలు, సూచనలు అందచేశారు.
త్వరలోనే ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ది పనుల గురించి తాము స్వయంగా వచ్చి పరిశీలించి పనులను నిర్వహించేందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మేకపాటికి వివరించారు.
Comments are closed.