ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ఏ లోటు రాకుండా చూడాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి, కోవిడ్-19 పరిస్థితి, ఇళ్ల పట్టాలు సహా అనేక అంశాలపై మంత్రి సోమవారం నెల్లూరు డైకాస్ రోడ్ లోని ఆయన నివాసంలో అధికారులతో చర్చించారు.. అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో రాజీపడొద్దని మంత్రి పోలీస్ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్లపట్టాలు సహా పలు సమస్యలపై మండల కన్వీనర్లు, నియోజకవర్గ నాయకులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని ఆలస్యం చేయకుండా పరిష్కరించేందుకు కృషి చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమలో డి ఆర్ ఓ ఎం వీ. రమణ ఆత్మకూరు ఆర్డీవో రమాదేవి , సీపీవో, డీఎస్పీ సహా ఎమ్మార్వోలు, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments are closed.