The South9
The news is by your side.

ప్రధాని మోదీ మీద రాహల్ ట్వీట్ పంచ్

post top

గత కొంత కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రం తీసుకొని వచ్చిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వ్యవసాయ చట్టాలపై తన పందాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా గా రైతులు తమ దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాహుల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచ నియంతల పేర్లన్నీ’ M ‘తోనే ఎందుకు మొదలవుతాయని అంటూ ఒక వ్యంగ్య ప్రశ్న సంధించాడు. ఇటలీ మాజీ ప్రధాని ముసోలిని, పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌, ఈజిప్ట్‌ మాజీ అధ్యక్షుడు ముబారక్‌, సెర్బియా అధ్యక్షుడు మిలోసెవిక్, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు, సైనిక నియంత మొబుటు పేర్లను ప్ర‌స్తావించారు. ప్రధాన మోదీ పేరుని నేరుగా ప్రస్తావించకపోయినా తాను పంపాలనుకున్న మెసేజ్ ని ట్వీట్ ద్వారా పంపాడు రాహుల్ గాంధీ. ఈ ట్వీట్ కి ప్రతిస్పందనగా ఎనిమిది వేల రీ ట్వీట్లు 34 వేల లైకులు వచ్చాయి. దీనికి ప్రతిస్పందనగా కొంతమంది బిజెపి నాయకులు కాంగ్రెస్ లో కూడా ఎం అక్షరంతో నాయకులు ఉన్నారని అంటూ మోతిలాల్ నెహ్రూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లు కూడా ఎం అక్షరంతోనే మొదలవుతాయని విమర్శించారు. పనిలో పనిగా కొంతమంది మాయావతి మమతా బెనర్జీ పేర్లు ప్రస్తావిస్తూ రాహుల్ కి కౌంటర్ ఇచ్చారు. కొంతమంది అయితే అసలు ప్రధాని పేరు ముందు N కథ మొదలవుతుంది అని అన్నారు. మొత్తానికి రాహుల్ ట్వీట్ రసవత్తరంగా మారింది

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.