
ఛండీఘడ్: హర్యానా రాష్ట్రంలో ఈనెల 27న పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పాఠశాలలను తెరుస్తున్నట్లు విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ నెల 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వేసవి సెలవులు మంజూరు చేశారు.

జూలై ఒకటి నుంచి పాఠశాలలు, ఆగస్టులో ఉన్నత విద్యా సంస్థలను దశల వారిగా ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి కన్వర్ పాల్ గుజ్జర్ ప్రకటించారు. కరోనా కారణంగా మార్చి నెలలో విద్యా సంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. కేంద్రం అన్ లాక్ 2.0 ను జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తోంది. ఇందులో విద్యా సంస్థల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో విద్యా సంస్థల ప్రారంభానికి మార్గం సుగమమైంది
Comments are closed.