కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి రాందాస్ అథవాలే ని కలిసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల కన్వీనర్ పేరo నాగేశ్వరరావు గౌడ్

ఢిల్లీ :రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ)తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల కన్వీనర్ పేరం నాగేశ్వరరావు గౌడ్ ఈరోజు కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి రాందాస్ అథవాలే ను ఢిల్లీలో కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని , రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నిర్ణయం గా ప్రధానమంత్రి కి తెలపాలని మంత్రి కి ఇచ్చిన వినతి పత్రం లో తెలిపారు.
అలాగే నెల్లూరు జిల్లాలోని దుగ్గి రాజు పట్నం పోర్ట్ తొందరగా మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి ఉప ఎన్నిక గురించి అభ్యర్థి మన పాటి చక్రవర్తి , ప్రచార వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు కైలా శివకుమార్, కృష్ణా జిల్లా నాయకులు డాక్టర్ ఏలియా, బద్రి జనార్దన్ రావు గుంటూరు జిల్లా నాయకులు సిహెచ్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.