The South9
The news is by your side.

ప్రతీకార హత్యల కుట్ర భగ్నం..నాటు బాంబులతో ఇద్దర్ని హతమార్చేందుకు సిద్ధపడిన ముఠా పట్టివేత

post top

ప్రతీకార హత్యల కుట్ర భగ్నం… నాటు బాంబులతో ఇద్దర్ని హతమార్చేందుకు సిద్ధపడిన ముఠా పట్టివేత
* ఆరుగురి అరెస్టు… 23 నాటు బాంబులు స్వాధీనం
* గతంలో జరిగిన రెండు వేర్వేరు హత్యలకు ప్రతీకారం
* ఆ రెండు హత్య కేసుల నిందితుల్ని వదిలితే తమను ఎక్కడ చంపుతారోననే అనుమానం
* ఈ కారణాలతో రెండు హత్యలకు సిద్ధమై పోలీసులకు చిక్కిన వైనం

నాటు బాంబులతో ఇద్దర్ని హతమార్చేందుకు సిద్ధపడిన ముఠాను కళ్యాణదుర్గం పోలీసులు మరియు అనంతపురం సి.సి.ఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురి నిందితులను అరెస్టు చేశారు. వీరి నుండి 23 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన రెండు వేర్వేరు సమీప బంధువుల హత్యలకు ప్రతీకారంగా ఆ హత్య కేసుల్లోని కీలక నిందితులిద్దర్ని నాటు బాంబులు ద్వారా చంపాలని మరియు ఆ ఇద్దర్ని వదిలితే తమను చంపుతారని అనుమానించి ఈ పథకానికి సిద్ధమైనట్లు విచారణలో వెల్లడైంది. మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS  వివరాలు వెల్లడించారు.

** అరెస్టయిన నిందితుల వివరాలు:

1) ఇ. రాజశేఖర్, వయస్సు 25 సం,
తిప్పేపల్లి గ్రామం, కంబదూరు మండలం.
2) దేవరకొండ రామచంద్ర, వయస్సు 50 సం., వేపకుంట గ్రామం, కనగానపల్లి మండలం.
3) జి.లింగరాజు, వయస్సు 30 సం, తిప్పేపల్లి గ్రామం, కంబదూరు మండలం.
4) వి.హరి, వయస్సు 27 సం., వేపకుంట గ్రామం, కనగానపల్లి మండలం.( ప్రస్తుతం ఇతను అనంతపురం మండలం కురుకుంట గ్రామంలో నివాసమున్నాడు)
5) వి.నగేష్ వయస్సు 29 సం.,
సిండికేట్ నగర్ , అనంతపురం.
6) వి. నగేష్ వయస్సు 39 సం., పాపంపేట, అనంతపురం.

after image

** స్వాధీనం చేసుకున్నవి:

* 23 నాటు బాంబులు

** నేపథ్యం: ప్రస్తుతం అరెస్టయిన ఇ.రాజశేఖర్, దేవరకొండ రామచంద్రలు సమీప బంధువులు. ఇ.రాజశేఖర్ కు దేవరకొండ రామచంద్ర స్వయాన మేనమామ అవుతాడు. వీరి సమీప బంధువైన కనగానపల్లి మండలం వారాది కొట్టాలకు చెందిన ఇ.గోపాల్ హత్య 2010 సంవత్సరంలో జరిగింది. అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిన ఈ హత్య కేసులో ఇ.చంద్రశేఖర్ , ఇ.గంగాధర్ , మరికొందరు నిందితులు. ఆ తర్వాత 2019 సంవత్సరంలో కంబదూరు మండలం రాళ్ల అనంతపురం సమీపంలో మందుపాతర పేల్చి ఇ.దుర్గప్పను హతమార్చారు. ప్రస్తుతం అరెస్టయిన ఇ.రాజశేఖర్ , దేవరకొండ రామచంద్రలకు హతుడు సమీప బంధువు అవుతాడు. ఈ కేసులో కూడా ఇ.చంద్రశేఖర్ , ఇ.గంగాధర్ లు నిందితులుగా ఉన్నారు. సమీప బంధువులిద్దర్నీ హతమార్చిన ఇ.చంద్రశేఖర్ , ఇ.గంగాధర్ లపై ప్రతీకారం తీర్చుకోవాలని మరియు ఆ ఇద్దరూ తమను కూడా చంపే అవకాశముందని మేనమామ, మేనల్లుడు భావించారు. ఈక్రమంలో ఇ. చంద్రశేఖర్ , ఇ.గంగాధర్ లను తామే ముందుగా చంపాలని నిశ్చయించుకున్నారు. ఇందులో ఇ.రాజశేఖర్ తల్లి ఇ.ముత్యాలమ్మ ప్రోద్భలం ఉంది. ఆ ఇద్దరి హత్యకు వ్యూహరచన చేశారు. వి. హరితో చర్చించి నాటు బాంబుల తయారీకి అవసరమైన ముడి సరుకును వి. నగేష్ , ఇంకో వి. నగేష్ ల ద్వారా సమకూర్చుకున్నారు. తిప్పేపల్లి శివార్లలో ఉన్న జి.లింగరాజు తోటలో నాటు బాంబులు తయారు చేయించారు. ప్రత్యర్థులైన ఇ.చంద్రశేఖర్ , ఇ.గంగాధర్ లను నాటు బాంబులు వేసి చంపేందుకు సిద్ధమైన ఈ ముఠాను అనంతపురం సి.సి.ఎస్ డీఎస్పీ మహబూబ్ బాషాకి రాబడిన సమాచారం మేరకు కళ్యాణదుర్గం రూరల్ సి.ఐ శివశంకర్ నాయక్ , కంబదూరు ఎస్సై రాజేష్, సి.సి.ఎస్ సి.ఐ లు వహిద్ బాషా, యుగంధర్
బాబు మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు విక్టర్ , కిరణ్ , శీన, భాస్కర్ … కానిస్టేబుళ్లు ఫరూక్ మల్లి, అనిల్ లు కలసి కంబదూరు మండలం తిప్పేపల్లి గ్రామ శివారులో ఈరోజు ఉదయం అరెస్టు చేశారు.*                            * ప్రశంస: నాటు బాంబులతో ఇద్దర్ని హతమార్చాలనుకున్న ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న అనంతపురం సి.సి.ఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా, కళ్యాణదుర్గం రూరల్ సి.ఐ శివశంకర్ నాయక్ , కంబదూరు ఎస్సై రాజేష్, సి.సి.ఎస్ సి.ఐ లు వహిద్ బాషా, యుగంధర్

Post midle

బాబు మరియు హెడ్ కానిస్టేబుళ్లు విక్టర్ , కిరణ్ , శీన, భాస్కర్ … కానిస్టేబుళ్లు ఫరూక్ మల్లి, అనిల్ లను జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS అభినందించారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.